స్థిరాస్తి సంపన్నుడు లోధా - real estate rich man lodha
close

Published : 24/03/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థిరాస్తి సంపన్నుడు లోధా

హురున్‌ జాబితాలో అగ్రస్థానం
2020లో 39% పెరిగిన సంపద
డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌కు రెండో స్థానం

దిల్లీ: ఇళ్లు, గృహ సముదాయాలు, వాణిజ్య స్థలాల విక్రయాలపై కొవిడ్‌-19 ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ స్థిరాస్తి రంగంలో కొత్త కుబేరుల సంఖ్య పెరిగింది. ఈ రంగంలో 100 మంది భారతీయ కుబేరుల జాబితాను హురున్‌ విడుదల చేసింది. ఇందులో ఎనిమిది మంది తొలిసారి చోటు దక్కించుకున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా డెవలపర్స్‌)కు చెందిన మంగళ్‌ ప్రభాత్‌ లోధా వరుసగా నాలుగోసారి జాబితాలో అగ్రస్థానాన్ని పొందారు. 2020లో లోధా, ఆయన కుటుంబ సంపద నికరంగా 29 శాతం పెరిగి రూ.44,270 కోట్లకు చేరింది. డీఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్‌ సింగ్‌ రూ.36,430 కోట్ల సంపదతో రెండో స్థానాన్ని పొందారు. డీఎల్‌ఎఫ్‌ షేరు 50 శాతం పెరగడంతో ఈయన నికర సంపద 45 శాతం వృద్ధి చెందింది. 2020 సంవత్సరానికి రూపొందించిన ఈ జాబితా వివరాలు ఇలా.. 
*2019తో పోలిస్తే 2020లో 100 మంది శ్రీమంతుల సంపద 26 శాతం వృద్ధి చెంది రూ.3,48,600 కోట్లకు చేరింది. సగటున ఒక్కొక్కరి సంపద 27% వృద్ధి చెంది రూ.3,487 కోట్లుగా నమోదైంది. 
*కె రహేజా కార్ప్‌ సంస్థకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబం రెండు స్థానాలు మెరుగుపరచుకుని జాబితాలో మూడో స్థానంలోకి వెళ్లింది. రహేజా కుటుంబ నికర సంపద 70 శాతం పెరిగి రూ.26,260 కోట్లకు చేరింది. రూ.23,220 కోట్ల సంపదతో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌కు చెందిన జితేంద్ర విర్వానీ నాలుగో స్థానంలో నిలిచారు. నిరంజన్‌ హీరానందని (రూ.20,600 కోట్ల సంపద) ఐదో స్థానంలో నిలవగా.. వికాస్‌ ఒబెరాయ్‌ (రూ.15,700 కోట్లు), రాజా బాగ్‌మానే (రూ.15,990 కోట్లు), సుభాష్‌  రన్వాల్‌ (రూ.11,450 కోట్లు), అజయ్‌ పిరమాల్‌ (రూ.6,550 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
*జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అత్యధికంగా 31 మంది ముంబయి నగరానికి చెందిన వాళ్లే. ఆ తర్వాత స్థానాల్లో దిల్లీ (22 మంది), బెంగళూరు (20 మంది) ఉన్నారు. జాబితాలో 73 శాతం మంది ఈ మూడు నగరాల్లోనే ఉండటం గమనార్హం. 
*2019 జాబితాలో ఉన్న వాళ్లలో 27 మంది ఈ సారి చోటు దక్కించుకోలేదు.
*2020లో సంపద వృద్ధి చెందిన వాళ్లు 65 మంది ఉన్నారు. 
*సత్వా డెవలపర్స్‌కు చెందిన బిజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ అత్యంత వేగంగా సంపద వృద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. జాబితాలో 40 ఏళ్ల లోపు వాళ్లు ముగ్గురు ఉండగా.. 80 ఏళ్లకు పైబడిన వాళ్లు నలుగురు. జాబితాలోని అందరి సగటు వయస్సు
*జాబితాలో అత్యంత పిన్నవయస్కుడి ఆదిత్య చండక్‌ కాగా.. ఎక్కువ వయసున్న వ్యక్తి పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ (91 ఏళ్లు). 
*జాబితాల్లోని 100 మంది 15 నగరాల్లోని 71 కంపెనీలకు చెందినవాళ్లు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని