close

Updated : 13/04/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం

ముంబయి: కొవిడ్‌, లాక్‌డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు మంగళవారం ఊపిరి పీల్చుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా, మధ్యాహ్నం వరకూ  సూచీల్లో ఊగిసలాట ధోరణి కనిపించింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మార్కెట్‌ను మరింత సానుకూలంగా కదలాడేలా చేసింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలన్న నిర్ణయంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 660 పాయింట్లు లాభపడి, 48,544 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,504 వద్ద స్థిరపడింది.

ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లు లాభపడి, 48,120 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ కొనసాగింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ తదితర షేర్ల అండతో సూచీలు పాజిటివ్‌గా కదలాడాయి. అయితే, ఆశించినంత మేర జోష్‌ కనిపించలేదు. ఒకానొక దశలో 47,775 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌ విదేశీ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లాభాల్లోకి వచ్చేసింది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ తదితర షేర్లు లాభపడగా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని