పర్యాటక రంగం కళకళలాడాలంటే..! - travel tourism sector expects pathbreaking union budget for post covid recovery
close

Published : 19/01/2021 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పర్యాటక రంగం కళకళలాడాలంటే..!

 బడ్జెట్‌పైనే ఆశలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన రంగాల్లో పర్యాటకం కూడా ఒకటి. ఇప్పటికీ చాలా పర్యాటకరంగ ప్రదేశాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలు కాలేదు. ముఖ్యంగా భారీ ఎత్తున టీకా కార్యక్రమం మొదలుపెడితే కానీ.. మళ్లీ కార్యకలాపాలను పుంజుకోలేవు. భారత్‌లో పర్యాటక రంగం పుంజుకోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొవిడ్‌ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ (ఎఫ్‌ఏఐటీహెచ్‌) కూడా బడ్జెట్‌పై ఆశలు పెట్టుకొంది.

ఇప్పటికే ఎఫ్‌ఏఐటీహెచ్‌ తన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రితో కలిపి టూరిజమ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనిలో పర్యాటకశాఖ మంత్రి కూడా సభ్యుడిగా ఉండాలని కోరింది. పర్యాటక రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో చేర్చాలని కోరింది. ఈ రంగంలోని ఎగుమతులను పన్ను రహితంగా మార్చాలని ఆ సంస్థ కోరింది.

ప్రభుత్వం గ్లోబల్‌ మైస్‌ బిడ్డింగ్‌ ఫండ్‌ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించాలని ఎఫ్‌ఏఐటీహెచ్ కోరింది. సమావేశాలు, కార్యక్రమాలు, సదస్సులు, కన్వెన్షన్స్‌, ఎగ్జిబిషన్లకు సంబంధించిన పర్యాటక రంగాన్ని ‘మైస్‌’గా పేర్కొంటారు. భారతీయ కార్పొరేట్లు కూడా దేశీయ ‘మైస్‌’ రంగాన్ని వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఆ మేరకు వారికి పన్ను రాయితీలను ప్రకటించాలి. దీంతోపాటు టూరిజంలో భారత్‌ బ్రాండ్‌ను ప్రచారం చేసేందుకు వివిధ దేశాల్లోని మన రాయబార కార్యాలయాల కోసం రూ.2,500 కోట్ల నిధులను కేటాయించాలి. భారత్‌లోని మైస్‌, అడ్వెంచర్‌, హెరిటేజ్‌ పర్యాటకాలను ప్రచారం చేయాలి. 

పర్యాటక రంగాన్ని దేశంలో కీలక పరిశ్రమగా గుర్తించాలి. జీఎస్టీ కింద రిజిస్టర్‌ అయిన టూర్‌ ఆపరేటర్లు, హోటళ్లు, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా భారత్‌లో పర్యటిస్తే రూ.1.5లక్షల వరకు పన్ను రాయితీలు లభించేలా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు పర్యాటక రంగానికి అనుబంధంగా ఉండే  రవాణా రంగానికి సంబంధించిన అన్ని ఛార్జీలు ఒకే చోట చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పరిస్థితులు మెరుగుపడతాయని ఎఫ్‌ఏఐటీహెచ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి..

ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!

ఆర్థిక మంత్రికి అండదండలు

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని