కష్ట సమయంలో ప్రోత్సాహకరంగా.. - words of encouragement at a fragile time: anand mahindra praises pm modi
close

Published : 11/02/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్ట సమయంలో ప్రోత్సాహకరంగా..

ప్రధానిని కొనియాడిన ఆనంద్‌ మహీంద్రా

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర గురువారం ప్రధాని మోదీని ప్రశంసించారు. బుధవారం లోక్‌సభలో మోదీ తన ప్రసంగంలో ప్రైవేటు సంస్థలను ప్రశంసించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఇందులో భాగంగా.. దేశ అభివృద్ధిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ రంగంలో అందరికీ అవకాశాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగం కూడా ముఖ్యమని ప్రధాని చెప్పడంతో ఆ రంగానికి చెందిన పలు సంస్థలు మోదీని కొనియాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా ట్విటర్లో మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రైవేటు సంస్థలకు ప్రధాని ప్రోత్సాహకరమైన మాటలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయి.  దీనిని స్వాగతిస్తూ.. మనం అంచనాలను అందుకోవాలి.’’ అని ఆనంద్‌ మహీంద్రా ఆ పోస్టులో పేర్కొన్నారు.

జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్‌ జిందాల్‌ కూడా మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ ప్రైవేటు రంగంపై తనకున్న గౌరవాన్ని ప్రధాని మొదటిసారి బహిరంగంగా ప్రకటించారు.’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి..

కొటక్‌ మహీంద్రా కొత్త ఎఫ్డీ రేట్లు ఇవే

చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వంమరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని