close
రీట్స్‌లో 15 శాతం వాటా అమ్మకం

ముంబయి: రీట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌) లిమిటెడ్‌లో 15 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయిస్తోంది. ఆ మేరకు పెట్టుబడుల, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం ఒక ఆంగ్ల పత్రికలో ప్రకటన సైతం ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 87.4 శాతం వాటా ఉంది. ఓఎఫ్‌ఎస్‌ను నిర్వహించడం కోసం జూన్‌ 6 కల్లా ప్రతిపాదనలు పంపాలని మర్చంట్‌ బ్యాంకర్లను ఆహ్వానించింది. రవాణా, మౌలిక రంగాలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న రీట్స్‌ గతేడాది జులైలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.