close

ప్రధానాంశాలు

ముడిచమురు బలహీనమే


బంగారం

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం ప్రారంభంలో సానుకూలంగా చలించొచ్చు. అయితే అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. రూ.39,735 దిగువకు వెళ్తే కొంత బలహీనంగా కదలాడే అవకాశం ఉంటుంది. ఈవారం మొత్తం మీద రూ.39,018- రూ.40,216 మధ్య స్వల్ప శ్రేణికి పరిమితం కావచ్చు. రూ.40,461 స్థాయిని మించితేనే రాణించొచ్చు.


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.46,413 దిగువన ట్రేడయితే మరింత కిందకు దిగివచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రూ.45,292 లక్ష్యంతో రూ.47,679 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.47,454 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. తక్కువ రిస్క్‌తో ట్రేడ్‌ చేసే ట్రేడర్లు రూ.46,413 దిగువకు రాకుంటే షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండటమే మంచిది.


ప్రాథమిక లోహాలు

* రాగి జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.448.55 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే మరింత పడిపోవచ్చు. అయితే రూ.451.25 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ ఈ స్థాయిని నిలబెట్టుకుంటే రూ.461.15 వరకు పెరిగేందుకూ అవకాశం ఉంది.
* సీసం జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.150.45 కంటే దిగువకు ట్రేడ్‌ కాకుంటే స్వల్ప, మధ్య కాలానికి కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.
* జింక్‌ జనవరి కాంట్రాక్టు రూ.181.90 ఎగువన కదలాడితే సానుకూలతకు అవకాశం ఉంటుంది. రూ.181.45 కంటే కిందకు దిగివస్తే దిద్దుబాటుకు లోనుకావచ్చు కూడా.
* అల్యూమినియం జనవరి కాంట్రాక్టుకు రూ.141.95- 142.75 వద్ద గట్టి నిరోధం ఎదురవుతుంది. ఈ స్థాయిల వద్ద లాభాలు స్వీకరించడం ఉత్తమం. ఒకవేళ ఈ స్థాయిలను అధిగమిస్తే కాంట్రాక్టు మరింత ముందుకెళ్తుందని భావించవచ్చు.
* నికెల్‌ జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.1018.15 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే రూ.1041; రూ.1052 వరకు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో రూ.1,018 కంటే దిగువకు వస్తే రూ.1004.60; రూ.983 వరకు పడిపోవచ్చు.


ఇంధన రంగం

* ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం కూడా డీలాపడొచ్చు. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు లేకుంటే.. అధిక స్థాయిల వద్ద కొంత షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవచ్చు. సాంకేతికంగా కూడా రూ.4,241 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తేనే రాణించేందుకు అవకాశం ఉంటుంది.
* సహజ వాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.153 ఎగువన ట్రేడ్‌కాకుంటే రూ.133.95 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జనవరి కాంట్రాక్టుపై దిగుమతి సుంకానికి సంబంధంచి భారత్‌, పంట దిగుబడిపై మలేసియా ప్రభుత్వాలు చేసే ప్రకటనలు ప్రభావం చూపుతాయి.


 వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు మార్చి కాంట్రాక్టుకు ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. రూ.6,621 లక్ష్యంతో, రూ.6,313 వద్ద స్టాప్‌లాస్‌ పెటుకుని లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.
* జీలకర్ర మార్చి ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈవారం రూ.15,045 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.14,576 వరకు అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
* పత్తి ఏప్రిల్‌ కాంట్రాక్టును ఈవారం రూ.1,164 సమీపంలో షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. అయితే రూ.1,176 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.


- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.