జులై-సెప్టెంబరులో మారుతీ కార్ల ధరల పెంపు
close

Updated : 22/06/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులై-సెప్టెంబరులో మారుతీ కార్ల ధరల పెంపు

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తమ మొత్తం ఉత్పత్తుల ధరలను జులై-సెప్టెంబరులో  పెంచుతామని వెల్లడించింది. వివిధ కమొడిటీలతో పాటు ఉక్కు ధరలు బాగా పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ఏప్రిల్‌లో కూడా కార్ల ధరలను మారుతీ పెంచిన సంగతి తెలిసిందే. ‘ఉక్కు, విలువైన లోహాలు రోడియమ్‌, పల్లాడియమ్‌ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ భారాన్ని కొంతమేర వినియోదార్లకు బదిలీ చేశాం. లోహాల ధరలు తగ్గుతాయని భావిస్తే, అవి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కంపెనీ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు మరోసారి ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింద’ని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని