రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించిన జీవిత - Actor Rajshekhar health condition is currently stable
close
Updated : 22/10/2020 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించిన జీవిత

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతూ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వచ్చాయి. ఆయన కుమార్తె శివాత్మిక కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. వదంతులు నమ్మొద్దని కోరారు.

తాజాగా రాజశేఖర్‌ సతీమణి జీవిత మాట్లాడారు. ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని అన్నారు. దయచేసి అసత్యవార్తలను నమ్మవద్దని అదే విధంగా, ప్రచారం చేయొద్దని కోరారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమని కోరారు.

ఈ రోజు మధ్యాహ్నం రాజశేఖర్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. తన మిత్రుడు త్వరగా కోలుకోవాలని అగ్ర నటుడు చిరంజీవి సైతం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.

ఇవీ చదవండి...!

రాజశేఖర్‌ చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి: చిరుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని