కొత్త కొత్తగా.. మెట్రో రైల్‌లో సైకిల్‌! - Commuters can Carry Cycles Inside this Metro train
close
Updated : 19/11/2020 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కొత్తగా.. మెట్రో రైల్‌లో సైకిల్‌!

కేరళలో నూతన ప్రయోగం.. ప్రారంభించిన కోచి మెట్రో  

కోచి: చక్కని ఆరోగ్యాన్ని అందించే వ్యాయామాల్లో సైకిల్‌ తొక్కడం ఒకటి. అంతేకాకుండా ఈ అలవాటు పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఈ కరోనా కాలంలో షేర్‌ ఆటోలు తదితర వాహనాల్లో ఇళ్లకు చేరేందుకు ప్రజలు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైక్లింగ్‌ వల్ల లభించే ప్రయోజనాలను గుర్తించిన కేరళలోని కోచి  మెట్రో రైల్‌ సంస్థ.. మెట్రోల్లో సైకిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతించింది. కాగా, ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించటం విశేషం. ప్రయాణికులు మాత్రమే టికెట్‌ తీసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.

ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నుండి తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు అనువుగా.. ఆరోగ్యకర జీవన విధానానికి ప్రోత్సాహంగా తామీ నిర్ణయం తీసుకున్నట్టు కోచి మెట్రో ఎండీ అల్కేష్‌ కుమార్‌ శర్మ వివరించారు. తొలుత ఆరు స్టేషన్లలో మాత్రమే లభిస్తున్న ఈ వెసులుబాటును..  ప్రయాణికుల ఆదరణను బట్టి త్వరలోనే అన్ని స్టేషన్లకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోచి మెట్రో ప్రయాణికుల సౌకర్యార్ధం తమ పరిధిలోని 12 రూట్లకు ఆటో సదుపాయాన్నీ ప్రారంభించింది. మరి మెట్రోలో సైకిల్‌ ఎలా సాధ్యమో ఈ వీడియోలో మీరే చూడండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని