‘గుంజన్‌: సక్సేనా’ ఆపడం కుదరదు - Delhi HC refuses stay on streaming of Janhvi Kapoor film Gunjan Saxena The Kargil Girl
close
Published : 03/09/2020 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గుంజన్‌: సక్సేనా’ ఆపడం కుదరదు

న్యూదిల్లీ: జాన్వీకపూర్‌ కీలక పాత్రలో శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ వేదికగా ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. జాన్వీ నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వైమానికదళాన్ని కించపరిచేలా సినిమా ఉందని దిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. సినిమాలో చూపించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌)లో లింగ వివక్ష లేదని వెంటనే సినిమా ప్రదర్శనను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

గురువారం దీన్ని విచారించిన దిల్లీ హైకోర్టు సినిమా స్ట్రీమింగ్‌ నిలుపుదల చేయడం కుదరదని చెప్పింది. సినిమా విడుదలకు ముందే మీరు ఎందుకు స్పందించలేదని, ఇప్పటికే చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుండటంతో నిలుపుదల చేయడం సాధ్యం కాదని తెలిపింది. అదే సమయంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ధర్మా ప్రొడక్షన్స్‌, చిత్ర నిర్మాతలతో పాటు, ఓటీటీ ఫ్లాట్‌ఫాంను కూడా కోరింది. మాజీ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ గుంజన్‌ సక్సేనాను కూడా ఈ పిటిషన్‌లో చేర్చి కేంద్రం ఆరోపణలపై స్పందన కోరుతూ నోటీసులు జారీ చేయాలని కోర్టు అభిప్రాయపడింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని