భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కు కాజల్‌ - Kajal Aggarwal with Gautam Kitchlu at Acharya shoot
close
Published : 15/12/2020 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కు కాజల్‌

హైదరాబాద్‌: వివాహం అనంతరం మాల్దీవులకు వెళ్లిన కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌-గౌతమ్‌ కిచ్లూలు తమ విహారయాత్రను ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. హనీమూన్‌ నుంచి వచ్చిన వెంటనే కాజల్‌ తిరిగి తన వృత్తి జీవితంలోకి అడుగుపెట్టారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి సరసన ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

మంగళవారం తన భర్తతో కలిసి కాజల్‌ ‘ఆచార్య’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కథానాయకుడు చిరంజీవితో పాటు, చిత్ర బృందం కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. సెట్స్‌లో మరోసారి గౌతమ్‌-కాజల్‌లు దండలు మార్చుకున్నారు. చిరంజీవి సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం నూతన దంపతులను చిరు ఆశీర్వదించారు.

‘ఆచార్య’లో చిరుతో పాటు, రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయనది అతిథి పాత్ర అనుకున్నారు. కానీ, ఇందులో చరణ్‌ పూర్తి స్థాయిలోనే నటిస్తున్నారని సమాచారం. అంటే తండ్రీ తనయులిద్దరినీ తెరపై సమంగా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుందన్నమాట. కొవిడ్‌ విరామం తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే రంగంలోకి దిగారు. రామ్‌చరణ్‌ వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని