ఆదిపురుష్‌ విలన్‌ గురించి కరీనా ఏమందంటే... - Kareena Kapoor about Adipurush poster
close
Published : 04/09/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదిపురుష్‌ విలన్‌ గురించి కరీనా ఏమందంటే...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా కథానాయకుడు ప్రభాస్‌ తరువాతి చిత్రంగా ‘ఆదిపురుష్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరి బాహుబలి రేంజ్‌ కలిగిన ప్రభాస్‌ చిత్రంలో విలన్‌గా ఎవరు నప్పుతారు అనే ప్రశ్న తలెత్తడం సహజమే. ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న ఆదిపురుష్‌లో.. అత్యంత కీలకమైన పాత్ర రావణునిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. సైఫ్‌ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించటంపై ఆయన శ్రీమతి, బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ స్పందించారు.
‘‘సమర్పిస్తున్నాం.. చరిత్రలోనే అతి అందమైన విలన్‌ను.. మై మ్యాన్‌ సైఫ్‌ అలీ ఖాన్‌!’’ అంటూ తన ఉత్సాహాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

కాగా ఈ చిత్రానికి హిందీ దర్శకుడు ఓం రౌత్‌ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన గతంలో విజయవంతమైన హిందీ చిత్రం ‘తానాజీ’కి దర్శకత్వం వహించారు. ఇందులో కూడా సైఫ్‌ఖాన్‌ ప్రతినాయకుడిగా నెగెటివ్‌ పాత్రలో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా రానున్న 3డీ చిత్రం ఆదిపురుష్‌ను.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్‌చేసి విడుదల చేయనున్నారు. మరి మర్యాదా పురుషోత్తముడు రాముడిగా ప్రభాస్‌ను, ‘అందమైన’ రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ను చూడాలంటే.. 2022 వరకు ఆగాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని