థియేటర్లు తెరవగానే మహేశ్‌ చిత్రం రిలీజ్‌..! - Mahesh Babu Movie ReRelease In Chennai After Lockdown
close
Updated : 15/10/2020 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లు తెరవగానే మహేశ్‌ చిత్రం రిలీజ్‌..!

రేసులో నితిన్‌, అల్లు అర్జున్‌
 

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రంగంలో సందడి తగ్గింది. అయితే అన్‌లాక్‌ నిబంధనల్లో భాగంగా అక్టోబర్‌ 15వ తేదీ నుంచి 50శాతం సీట్లను భర్తీ చేస్తూ సినిమాహాళ్లు తెరవడానికి‌ చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు నెలల తర్వాత ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చే విధంగా లాక్‌డౌన్‌కి ముందు ప్రేక్షకుల్ని అలరించిన పలు సూపర్‌హిట్‌ చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

కాగా, థియేటర్లు ఓపెన్‌ కాగానే.. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’(తమిళ్‌డబ్బింగ్‌‌) చిత్రాన్ని చెన్నైలో మొదటి సినిమాగా ప్రదర్శించనున్నారు. మరోవైపు నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘భీష్మ’, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలను సైతం బెంగళూరులోని పలు థియేటర్లలో స్ర్కీనింగ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని