ముహూర్తం కుదిరింది.. క్లాప్‌ పడింది! - New movies start from dasara in tollywood
close
Published : 26/10/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముహూర్తం కుదిరింది.. క్లాప్‌ పడింది!

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ప్రస్తుతం పలు సినిమాలు చిత్రీకరణలు జరుపుకొంటుండగా, కొత్త సినిమాలు కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయదశమి టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం నింపింది. విశిష్టమైన రోజు కావడంతో ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా అనేక సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు వరుసగా వెలువడ్డాయి. మరోవైపు దసరాకు మించిన మంచి రోజు మరొకటి లేదంటూ కొత్త చిత్రాలు కూడా షురూ అయ్యాయి.

చైతూ చెప్పనున్న ‘థ్యాంక్యూ’

‘ఇష్క్’, ‘మనం’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని దిల్ రాజు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగచైతన్యతోపాటు సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ హాజరయ్యారు. థ్యాంక్యూ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా బీవీఎస్ రవి సంభాషణలు అందించారు.

‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అంటున్న శర్వా

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కథానాయకుడు శర్వానంద్‌. తాజాగా ఆయన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’. రష్మిక కథానాయిక. విజయదశమి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర బృందం, ఆ తర్వాత సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

‘కోతి కొమ్మచ్చి’ మొదలైంది

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్, సమీర్ వేగేశ్నలు కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు సతీశ్ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎల్ వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కథానాయకుడు అల్లరి నరేష్ ముఖ్య అతిథులుగా హాజరై ‘కోతి కొమ్మచ్చి’కి కొబ్బరికాయ కొట్టారు. నవంబర్ 3 నుంచి అమలాపురంలో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు దర్శకుడు సతీశ్ వేగేశ్న తెలిపారు.

శ్రీ సింహ కథానాయకుడిగా..

శ్రీసింహా కథానాయకుడిగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ సినిమాను నిర్మిస్తోంది. మణికాంత్‌ దర్శకుడు. దసరా సందర్భంగా ఈ చిత్రం పట్టాలెక్కింది. ముహూర్త సన్నివేశానికి అగ్ర దర్శకుడు రాజమౌళి క్లాప్‌నివ్వగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్క్రిప్ట్‌ అందించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘మేరా నామ్‌ జోకర్‌’ షురూ!

4ఎ.ఎం. మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ‘మేరా నామ్‌ జోకర్‌’ చిత్ర షూటింగ్‌ దసరా రోజున ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి దర్శకుడు మారుతీ క్లాప్‌ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని