డ్రగ్‌ చాట్‌ చేశా.. కానీ తీసుకోలేదు!: రకుల్‌ - Rakul Preet Singh statement was recorded by the SIT
close
Published : 26/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్‌ చాట్‌ చేశా.. కానీ తీసుకోలేదు!: రకుల్‌

ముంబయి: మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు హాజరైన కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘డ్రగ్‌ చాట్స్‌’ చేసినట్లు ఒప్పుకున్నారట. కానీ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని ఆమె వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘సిట్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. దాన్ని విశ్లేషించి, నివేదికను కోర్టుకు సమర్పించనున్నాం’ అని పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం అధికారులు రకుల్‌కు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు అధికారులు ఆమెను విచారించినట్లు తెలుస్తోంది. రకుల్‌ నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రగ్‌ సరఫరాదారులతో తను ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. డ్రగ్‌ కేసులో తన పేరును మీడియా ప్రస్తావించడంతో కొన్ని రోజుల క్రితం రకుల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌ శనివారం ఎన్‌సీబీ విచారణకు హాజరు కానున్నారు.

జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ హఠాన్మరణం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన తన గదిలో ఉరివేసుకుని కనిపించారు. తమ కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ ప్రారంభించారు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించగా ఆమె కొందరితో డ్రగ్‌ చాటింగ్‌ చేసినట్లు బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. రియా స్టేట్‌మెంట్‌ ప్రకారం విచారిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని