‘వివాహ భోజనంబు’ అంటున్న సందీప్‌కిషన్‌ - Sundeep Kishan produce new movie name Vivaha Bhojanambu
close
Updated : 18/08/2020 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వివాహ భోజనంబు’ అంటున్న సందీప్‌కిషన్‌

హైదరాబాద్‌: మొదటి నుంచి విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్‌. ఆయనలో చక్కని నటుడు, నిర్మాతతో పాటు మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ఈ అభిరుచితోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వివాహ భోజనంబు’ పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించి సేవలందిస్తున్నారు. ఇప్పుడాయన ఇదే ‘వివాహ భోజనంబు’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ‘నిను వీడని నీడని నేను’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. శినిష్‌ అనే మరో నిర్మాతతో కలిసి ఈ తాజా చిత్రాన్ని నిర్మించబోతున్నారు సందీప్‌.

తాజాగా ఈ చిత్ర ప్రీ-లుక్‌ను విడుదల చేశారు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. రామ్‌ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు చిత్ర నాయకానాయికలు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలియజేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని