సునీల్‌ నరైన్‌ యాక్షన్‌కు క్లీన్‌ చిట్‌  - Sunil Narine taken off suspected illegal bowling action warning list
close
Updated : 18/10/2020 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునీల్‌ నరైన్‌ యాక్షన్‌కు క్లీన్‌ చిట్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ తిరిగి కోల్‌కతా జట్టు తరఫున బౌలింగ్ చేయనున్నాడు. యూఏఈ వేదికగా జరగుతున్న మెగా టీ20 టోర్నీలో ఆడుతున్న నరైన్ అక్టోబరు 10న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన బౌలింగ్‌ యాక్షన్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి మోచేతిని ఎక్కువగా వంచి బౌలింగ్‌ చేశాడని అంపైర్లు నరైన్‌ను లీగ్‌ బౌలర్ల హెచ్చరిక జాబితాలో ఉంచారు. దీంతో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 16వ తేదీ ముంబయితో కోల్‌కతా పోటీ పడిన మ్యాచ్‌లో స్థానం కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయిన విషయం తెలిసిందే.

నరైన బౌలింగ్‌పై అంపైర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోల్‌కతా జట్టు యాజమాన్యం లీగ్‌ బౌలింగ్‌ కమిటీని ఆశ్రయించింది. నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించిన వీడియోను కమిటీకి అందజేసింది. పంజాబ్‌ మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను కమిటీ సునిశిత పరిశీలన చేసింది. ఈ మిస్టరీ స్పిన్నర్‌ నిబంధనల మేరకే మోచేయి వంచి బౌలింగ్‌ చేసినట్లు కమిటీ వివరణ ఇచ్చింది. అయితే ఈ లీగ్‌లో నరైన్‌ తర్వాత ఆడనున్న మ్యాచ్‌లతో సైతం ఈ విధంగానే బౌలింగ్‌ వేయాలని పేర్కొంది. ఇదిలా ఉంటే గతంలోనూ నరైన్‌ అంపైర్ల నుంచి ఇటువంటి హెచ్చరికలు అందుకున్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని