Most Eligible Bachelor: ఊహలెగిరాయి.. ఊసులదిరాయి - The romantic and breezy melody Leharaayi from Most Eligible Bachelor
close
Updated : 16/09/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: ఊహలెగిరాయి.. ఊసులదిరాయి

గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి... గోరు వెచ్చనైన ఊసులదిరాయి... అంటూ పాడుకున్న ఓ జంట కథేమిటో తెలియాలంటే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చూడాల్సిందే. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ఈ చిత్రంలోని ‘లెహరాయీ... లెహరాయీ’ అంటూ సాగే పాటని ఇటీవల విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకి అనూహ్యమైన స్పందన లభించిందని చిత్రబృందం తెలిపింది. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.



.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని