పళ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రం చేస్తుంది - Thoroughly cleans fruits and vegetables
close
Published : 18/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పళ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రం చేస్తుంది

ఈనాడు, హైదరాబాద్‌: పళ్లు, కూరగాయల మీ కంటికి కనిపించకుండా ఎన్నో క్రిములు, పురుగు మందుల అవశేషాలు, మలినాలు ఉంటాయి. నీటిలో ఎంతగా కడిగినా ఇవి పూర్తిగా పోకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పళ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రం చేసే ద్రావణాన్ని (లిక్విడ్‌) ను ‘హెడెన్‌’ అనే బ్రాండు పేరుతో 200ఎంఎల్‌, 500ఎంఎల్‌ బాటళ్లలో ఈ ఉత్పత్తిని ఆవిష్కరించింది హైదరాబాద్‌కు చెందని హే టుమారో కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌. క్రిములు, పురుగు మందుల అవశేషాలను ఈ ద్రావణం 99.9% వరకూ పోగొడుతుందని కంపెనీ డైరెక్టన్‌ అనిత నల్లపాటి తెలిపారు. ఈ ఉత్పత్తిని స్థానికంగానే తయారు చేయటం కోసం త్వరలో రూ.9 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. హే టుమారో కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌కు అకీరా భారతీ కార్పొరేట్‌ నుంచి రూ.1.5 కోట్ల పెట్టుబడి లభించింది. అదేవిధంగా 99 వెంచర్స్‌ అనే సంస్థ రూ.3 కోట్లు సమకూర్చింది. దీంతో తయారీ కార్యకలాపాలతో పాటు ఆర్‌అండ్‌డీ, మార్కెటింగ్‌- విక్రయాల విభాగాల్లో విస్తరించే సన్నాహాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని