అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌ - achchennaidu got corona positive
close
Updated : 13/08/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌

వెల్లడించిన అచ్చెన్న తరఫు న్యాయవాది

గుంటూరు: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరులోకి రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో పోలీసులు ఇటీవల అచ్చెన్నాయుడిని అరెస్టు చేయగా.. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగానే ఉందని రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

మరోవైపు, ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9996 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 82మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. వారిలో 1.70లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని