Adivi Sesh: ‘మేజర్‌’ మిగిలింది పది రోజులే! - adivi sesh about major
close
Updated : 03/06/2021 23:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Adivi Sesh: ‘మేజర్‌’ మిగిలింది పది రోజులే!

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  26/11 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్‌’. యువ నటుడు అడివి శేష్.. మేజ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు . పాన్ ఇండియా స్థాయిలో ద‌ర్శకుడు శ‌శి కిర‌ణ్ తిక్క ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణకు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు శేష్‌. ఆ వివ‌రాలివీ.. ‘ఈ సినిమా విడుద‌ల తేదీలో మార్పు ఉండొచ్చ‌ని కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన‌ప్పుడే అనుకున్నాం. ఎందుకంటే చిత్ర బృందంలో చాలామంది ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్స్ట్ (వీఎఫ్ఎక్స్‌) విభాగంలో అంద‌రూ కొవిడ్ బారిన ప‌డ్డారు. మిల‌ట‌రీ ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపేందుకూ ఈ స‌మ‌యంలో అనుమ‌తి ల‌భించ‌లేదు. దాంతో వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని భావించాం. ప్ర‌స్తుతం నెల‌కొన్న కొవిడ్ తీవ్ర‌త వ‌ల్ల ఎలాగూ వాయిదా వేయాల్సి వ‌చ్చింది. సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందే అధిక భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇంకా ప‌ది రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది’ అని తెలిపారు.

ఈ చిత్రంలో యువ నాయిక‌లు సయీ మంజ్రేకర్‌, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టెన్‌మెంట్స్‌,ఏప్ల‌స్ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని