శంకర్‌-చెర్రీ మూవీ: స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌? - ar rahman to team up with shankar for his period drama with ram charan
close
Published : 11/03/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌-చెర్రీ మూవీ: స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏఆర్‌ రెహమాన్‌ నేరుగా ఓ తెలుగు మూవీకి స్వరాలు సమకూర్చనున్నారా? అదీ శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబోలో వస్తున్న చిత్రమైతే! ఆహా ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నకు రెహమాన్‌ ఇచ్చిన సమాధానం చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్విటర్‌లో ఒక అభిమాని రెహమాన్‌ని ప్రశ్నిస్తూ ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ ఎప్పుడు వస్తుంది’ అని అడిగారు. అందుకు ‘త్వరలోనే’అని సమాధానమిచ్చిన రెహమాన్‌ స్మైలీ సింబల్‌ పోస్ట్‌ చేశారు.

ఇప్పుడీ ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మామూలుగా శంకర్‌ డైరెక్ట్‌ చేసే చాలా చిత్రాలకు ఏఆర్‌ రెహమానే సంగీతం అందిస్తారు. ఇప్పుడీ ఈ సమాధానంతో శంకర్‌-చెర్రీల సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. ఒకవేళ ఆయన్నే చిత్రబృందం నిర్ణయిస్తే రెహమాన్‌ వరల్డ్‌క్లాస్‌ మ్యూజిక్‌కు, శంకర్‌ టేకింగ్‌కు రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌ తోడైతే వెండితెరపై పండగ వాతావరణమే. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన నేపథ్యంలో కథ ఉండనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా 2022లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రబృందం చెబుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని