Bollywood: ప్రేయసి కోసం రూ.23 కోట్లు - arjun kapoor buys swanky rs 23 crore flat near malaika aroras home
close
Updated : 31/05/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: ప్రేయసి కోసం రూ.23 కోట్లు

విల్లా కొనుగోలు చేసిన అర్జున్‌ కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌కపూర్‌-మలైకా అరోరా మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. తన ప్రేయసి మలైకాకు అత్యంత చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అర్జున్‌కపూర్‌ బాంద్రాలో ఓ సరికొత్త విల్లాను కొనుగోలు చేశారట. ప్రస్తుతం తన సోదరితో కలిసి ముంబయిలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్న అర్జున్‌కపూర్‌ తాజాగా బాంద్రాలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలో గల ఈ విల్లా కోసం అర్జున్‌ సుమారు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు, ఆయన కొనుగోలు చేసిన ఈ ఇల్లు.. మలైకా అరోరా ఉంటున్న ఇంటికి అతి తక్కువ దూరంలోనే ఉంటుందట.

అర్జున్‌కపూర్‌-మలైకా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వయసు పరంగా చూసుకుంటే అర్జున్‌కపూర్‌ కంటే మలైకా అరోరా 12 సంవత్సరాలు పెద్దది. దీంతో వీరిద్దరి రిలేషన్‌ గురించి వార్తలు బయటకు వచ్చిన తరుణంలో అందరూ వీరి వయసు గురించే మాట్లాడుకున్నారు. వయసుతో తమకు సంబంధంలేదని.. ప్రేమానుబంధాలు ముఖ్యమని ఎన్నో సందర్భాల్లో ఈ జంట చెప్పింది కూడా.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని