అవును నేను పవన్‌కల్యాణ్‌కు భక్తుడిని - bandla ganesh about vakeel saab
close
Published : 05/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవును నేను పవన్‌కల్యాణ్‌కు భక్తుడిని

హైదరాబాద్‌: ‘ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్తకన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు.. పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌’ అని సగర్వంగా చెప్పుకొంటానని నటుడు, నిర్మాత బండ్లగణేశ్‌ అన్నారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు.

‘పవన్‌కల్యాణ్‌ ఒక వ్యసనం. అలవాటైతే చనిపోయే వరకూ వదల్లేం. ఈ సినిమా గురించి మాట్లాడమని పిలిచారు. ఒక ఐఏఎస్‌ దగ్గరకు వెళ్లి, ‘సర్‌ మీరు పదో తరగతి బాగా చదివారు’ అని అంటే ఎలా ఉంటుందో.. పవన్‌ సినిమా గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది. ఆయన చూడని హిట్లా.. బ్లాక్‌బస్టర్లా.. ఆయన ఒక నాందికి శ్రీకారం చూట్టారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. చాలా మంది పుడతారు.. చనిపోతారు.. కొందరే చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ, సినిమా తర్వాత సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఆయన కళ్లలో నిజాయతీ ఉంది. ఆయన వెనుక ఎన్ని ప్లాన్స్‌ వేసినా ముందు వెళ్తే అన్నీ మర్చిపోతాం. నేను నిజంగా పవన్‌కల్యాణ్‌ భక్తుడిని’’ అని అన్నారు.

తాను జీవితంలో మర్చిపోలేని సినిమా ‘వకీల్‌సాబ్’అని కథానాయిక అంజలి అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్‌రాజులకు ధన్యవాదాలు. ఈ టీమ్‌తో పనిచేయడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ సినిమాను థియేటర్‌లో చూసి ప్రోత్సహించాలని కోరారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని