PSPK27: మొఘల్‌ చక్రవర్తి సోదరి ఈమేనా? - bollywood actress will play the role of ourangajebu sister in pspk 27
close
Updated : 12/03/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PSPK27: మొఘల్‌ చక్రవర్తి సోదరి ఈమేనా?

ఊపందుకున్న ప్రచారం

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌ దర్శకుడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లిమ్స్‌ సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకర్షించింది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో ఈ పీరియాడికల్‌ డ్రామా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అలాగే, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటించనున్నారట. అలాగే ఆయన సోదరిగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు నెట్టింట్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

‘హరిహర వీరమల్లు’లో పవన్‌కల్యాణ్‌ వజ్రాలదొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ సందడి చేయనుంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని