Butta Bomma: క్రేజ్‌ ఏమాత్రం తగ్గలే! - buttabomma video song creats record in tfi
close
Published : 24/05/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Butta Bomma: క్రేజ్‌ ఏమాత్రం తగ్గలే!

ఏడాది దాటినా ఫాలోయింగ్‌కి డోకా లేదు

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ ఓ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇందులోని ‘బుట్టబొమ్మా’ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించిన విషయం విదితమే. తమన్‌ అందించిన స్వరాలకు బన్నీ-పూజా కలిసి చేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కర్నీ కట్టిపడేసింది. సెలబ్రిటీలను సైతం ఈ పాట ఎంతోగానో ఆకర్షించింది. కాగా, తాజాగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్‌ 40 లక్షల లైక్స్‌ని సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దీంతో అతి తక్కువ కాలంలో 4 మిలియన్ల లైక్స్‌ సొంతం చేసుకున్న మొట్టమొదటి తెలుగు వీడియో సాంగ్‌గా ఇది రికార్డ్‌ సృష్టించింది. అంతేకాకుండా లైక్స్‌ విషయంలో దక్షిణాదిలోనూ ఇంతటి క్రేజ్‌ సొంతం చేసుకున్న పాట ఇదే కావడం విశేషం. ఈ రికార్డ్‌కు కారణమైన నెటిజన్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ ఓ పోస్ట్‌ పెట్టింది.

ఇక, సినిమా విషయానికి వస్తే ఇందులో బన్నీ.. బంటుగా, పూజాహెగ్డే అమూల్యగా(అమ్ము) మెప్పించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, జయరామ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సముద్రఖని, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, ఈ సినిమాలోని ప్రతిపాటా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన విషయం తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని