పంజాబ్‌లో అన్ని కార్పొరేషన్‌లు ‘హస్త’గతం!  - cong wins mohali municipal corporation
close
Published : 18/02/2021 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంజాబ్‌లో అన్ని కార్పొరేషన్‌లు ‘హస్త’గతం! 

చండీగడ్‌: పంజాబ్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగరేసింది. ఏ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అక్కడి మొత్తం 8 నగర పాలక సంస్థలను ‘హస్త’గతం చేసుకుంది! తాజాగా వెలువడిన మొహాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. అంతకుముందు బుధవారం వెలువడిన భటిండా, హోషియార్‌పుర్‌, కపుర్తలా, అబోహర్‌, బటాలా, పఠాన్‌కోట్‌ కార్పొరేషన్ల ఫలితాల్లో అన్నింటా కాంగ్రెస్‌ గెలుపొందింది. మోగా కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్‌ సీటును ఆ పార్టీనే దక్కించుకోనుంది. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసినట్లయ్యింది.

మొహాలీలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో అవకతకవకలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల అక్కడి ఫలితాల వాయిదా వేసింది. అక్కడ బుధవారం రీపోలింగ్‌ నిర్వహించి.. గురువారం ఫలితాలు వెలువరించారు. ఈ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 37 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన 13 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు పాగా వేశారు. ఈ ఎన్నికల్లో అకాలీదళ్‌ రెండో స్థానంలో నిలవగా.. ఆప్‌, భాజపా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని