దీపిక టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సింది! - deepika padukone tollywood entry
close
Updated : 07/03/2021 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపిక పదుకొణె.. ఇటీవలే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నాయికగా ఎంపిక కావడమే ఇందుకు కారణం. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ఆడిపాడబోయేది ఎవరా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఈ అమ్మడి పేరు ప్రకటించారు దర్శక-నిర్మాతలు. దాంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరగడం మొదలైంది. హిందీలో గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించి శెభాష్‌ అనిపించుకున్న ఈ భామ తొలిసారి తెలుగు చిత్రం ఖరారు చేయడంతో అందరి చూపు ఆమెవైపు నిలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది దీపికకు. అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు.  జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ 4 యు’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది దీపికా. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని