Cinema News: ఘనంగా ‘సాహో’ నటి పెళ్లి - evelyn sharma shares first photo as she marries boyfriend tushaan bhindi
close
Published : 08/06/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఘనంగా ‘సాహో’ నటి పెళ్లి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సాహో’తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ భామ ఎవెలిన్‌ శర్మ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు తుషాన్‌ భిందీతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కరోనా కారణంగా అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం ఆస్ట్రేలియాలో వేడుకగా జరిగింది. వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోమవారం ఉదయం ఎవెలిన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఓ స్నేహితుడి ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన దంత వైద్యుడు, పారిశ్రామిక వేత్త తుషాన్‌తో ఎవెలిన్‌కి పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ఒకొరికొకరు మనసు ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పట్ల వారి స్నేహితులు సంతోషిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

జర్మనీకి చెందిన ఎవెలిన్‌ శర్మ ‘టర్న్‌ లెఫ్ట్’ అనే హాలీవుడ్‌ మూవీతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’తో బాలీవుడ్‌ తెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఏ జవానీ హై దివానీ’, ‘ఇష్క్‌’, ‘మే తేరా హీరో’, ‘హిందీ మీడియం’, తదితర చిత్రాల్లో కథానాయికగానే కాకుండా సహాయనటిగాను మెప్పించారు. వీటితోపాలు పలు చిత్రాల్లో ఆమె స్పెషల్‌ సాంగ్స్‌ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’లో జెన్నీఫర్‌ పాత్రలో ఎవెలిన్‌ మెరిసిపోయిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని