Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - evening news at five pm
close
Published : 27/09/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. గులాబ్‌ తుపాను ప్రభావం.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: కేసీఆర్‌

గులాబ్‌ తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో తాజా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. గులాబ్ తూపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని.. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

‘గులాబ్‌’ తుపాను లైవ్‌ విశేషాల కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రం పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు: కేటీఆర్‌

తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐటీ, పరిశ్రమలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా లేవనెత్తిన అంశాలకు కేటీఆర్‌ సమాధానం చెప్పారు. గతంలో నీకెంత.. నాకెంత అనే విధంగా వ్యవహారాలు ఉండేవన్నారు. 17 వేలకుపైగా పరిశ్రమలకు ఆకర్షించగలిగామని.. కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడాలన్నారు. కట్టుకథలతో పరిశ్రమలు రావని.. కఠోర శ్రమతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆక్షేపించారు.

3. తుపాను బాధితులకు అండగా తెదేపా: చంద్రబాబు

గులాబ్ తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలన్నారు. బాధితులకు తెదేపా శ్రేణులు అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. తుపాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

4. తెలంగాణలో గొర్రెల పెంపకంతో రూ.10వేల కోట్ల సంపద: తలసాని

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకంతో రూ.10వేల కోట్ల సంపద సృష్టించామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శాసనసభలో తెలిపారు. పురపాలికల్లో ఉన్నవారికి గొర్రెల పంపిణీ అంశం పరిశీలనలో ఉందని వెల్లడించారు. గొర్రెల పెంపకం వృత్తిలో ముస్లింలు ఉన్నందున వారికి కూడా ఈ పథకంలో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన తలసాని.. మొదటి దశ పెండింగ్‌ డీడీలు కొన్ని ఉన్నాయని వాటిని త్వరలో చెల్లిస్తామన్నారు.

5. మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతదేహం లభ్యం

నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్‌ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపులో భాగంగా నెక్నాంపూర్‌ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. రెండు రోజుల క్రితం పెరుగు ప్యాకెట్‌ కోసం వచ్చి మణికొండ డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్‌ మృతదేహం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చింది. 

6. Ayushman Bharat: ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడీ

భారత వైద్యారోగ్య రంగంలో నూతన అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌’ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కేటాయిస్తామని ప్రకటించారు. ‘పేద, మధ్యతరగతి ప్రజల వైద్య చికిత్సలకు ఎదురయ్యే సమస్యలను తొలగించడంలో ఈ మిషన్‌ పెద్ద పాత్ర పోషిస్తుంది. 130 కోట్ల ఆధార్ ఐడీలు, 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు, సుమారు 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు.. ఇంత భారీ అనుసంధాన మౌలిక సదుపాయాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు’ అని పేర్కొన్నారు. 

7. ప్రధానిగా మన్మోహన్‌కు బదులు ఆయన్ను ఎంపిక చేయాల్సింది..!

2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో సోనియా గాంధీ ప్రధానమంత్రిగా ఉండాల్సిందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యలు చేశారు. లేకపోతే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ప్రధానిగా ఎంపిక చేయాల్సిందని అన్నారు. ఈ సందర్భంగా సోనియాకు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మధ్య పోలిక తెచ్చారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. పవార్‌కు ఆ బాధ్యత ఇచ్చిఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

8. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ!

సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అయితే, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కాపేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అలా చివరి వరకూ ఊగిసలాట మధ్య కదలాడి ఆఖరుకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,048.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,412.32 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 29.41 పాయింట్ల స్వల్ప లాభంతో 60,077.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.90 పాయింట్లు పెరిగి 17,855.10 వద్ద స్థిరపడింది.

9. ప్లేఆఫ్‌ కోసం రాయల్స్‌.. పరువు కోసం సన్‌రైజర్స్‌

ఆడిన 9 మ్యాచ్‌లలో 8 పరాజయాలతో ప్లేఆఫ్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓవైపు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌ రేసులో నిలవాలని తపన పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ మరోవైపు. ఐపీఎల్‌ 2021 రెండో దశలో ఈ జట్లు సోమవారం సాయంత్రం పోటీ పడనున్నాయి. జట్టులో భీకర బ్యాట్స్‌మెన్‌ ఉన్నప్పటికీ.. మిడిలార్డర్‌ రాణించకపోవడంతో తడబడుతున్న రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లో గెలుపొంది పుంజుకోవాలని భావిస్తోంది. ఎనిమిది పరాజయాలతో కేవలం రెండు పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. 

10. ‘కొండపొలం’ ట్రైలర్‌ చూశారా..!

 ‘కేజీయఫ్‌ 2’ నో ఛేంజ్‌ .. ‘ఆది పురుష్‌’ డేట్‌ ఫిక్స్‌.. ‘పుష్ప’ రెండో పాట అప్‌డేట్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని