సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం! - first folk song by sensational singer yemunnavepilla is out now on sidh
close
Published : 13/02/2021 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం!


హైదరాబాద్‌: ప్రస్తుత సినిమాల్లో ఒక హిట్‌ సాంగ్‌ ఉందంటే అది సిధ్‌ శ్రీరామ్‌ పాడి ఉండొచ్చనడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాలకు సైతం ఆయన గాన మాధుర్యంతో విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. ఆ క్రమంలోనే ‘నల్లమల’ అనే చిత్రంలో ‘ఏమున్నావే పిల్లా..ఏమున్నావే’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు. తాజాగా విడుదలైన లిరికల్‌ వీడియో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సాంగ్‌తో శ్రీరామ్‌ మొదటిసారి జానపద గీతాన్ని ఆలపించటం ప్రత్యేకత. సంగీత దర్శకుడు పీఆర్‌ స్వయంగా గీతాన్ని రచించి, బాణీలు కట్టారు. రవిచరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమిత్‌ తివారి, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు నటిస్తున్నారు. నమో క్రియేషన్స్‌పై ఆర్‌ఏం అనే ప్రొడ్యూసర్‌ నిర్మిస్తున్నారు. మరి లేటెందుకు ఆ జానపద గీతాన్ని మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి!


ఇవీ చదవండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని