టెస్టులు చేయించుకొమ్మంటే ఖాళీ ఫ్లైట్‌తో వెనక్కి - flight returns empty as crew refused to undergo corona tests at airport
close
Updated : 24/04/2021 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెస్టులు చేయించుకొమ్మంటే ఖాళీ ఫ్లైట్‌తో వెనక్కి

దిల్లీ: ఇతర ప్రదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారిని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షలు చేయించుకొమ్మంటే పారిపోయిన ఘటనలు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా దిల్లీ విమానాశ్రయంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అమెరికా నుంచి భారత్‌కు విమానం తీసుకొచ్చిన సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా.. అందుకు నిరాకరించిన ఆ సిబ్బంది ఖాళీ విమానంతో వెనక్కి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దిల్లీ ఎయిర్‌పోర్టుల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. వెంటనే వెళ్లిపోయే విమానాలు మినహా ఇతర దేశాల ఎయిర్‌లైన్‌ సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందే. నిన్న న్యూయార్క్‌ నుంచి యునైటెడ్‌ ఎయిర్‌లైన్‌ విమానం ఒకటి దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ విమానం వెంటనే తిరుగు ప్రయాణమయ్యే జాబితాలో లేకపోవడంతో అందులోని సిబ్బంది ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. కానీ యునైటెడ్‌ ఎయిర్‌లైన్‌ క్రూ సభ్యులు టెస్టులు చేయించుకోలేదు సరికదా.. ప్రయాణికులెవరినీ ఎక్కించుకోకుండానే ఖాళీ విమానంతో న్యూయార్క్‌కు వెళ్లిపోయారు.

ఇందుకు గల కారణాన్ని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారికంగా చెప్పనప్పటికీ.. స్థానిక అధికారుల ప్రయాణ నిబంధనల వల్ల ఏప్రిల్‌ 23న దిల్లీ- న్యూయార్క్‌  విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. అంతేగాక, ఏప్రిల్‌ 25 వరకు భారత్‌కు విమాన సేవలను యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ నిలిపివేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని