కొత్త పన్ను విధానంతో సేవింగ్స్‌పై ప్రభావం
close
Published : 17/02/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త పన్ను విధానంతో సేవింగ్స్‌పై ప్రభావం

దిల్లీ: ఎలాంటి మినహాయింపులు లేని కొత్త పన్ను విధానంలో వల్ల దేశంలో సేవింగ్స్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే సేవింగ్స్‌ చేయడం తగ్గుతోందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో రెండు రకాల పన్ను విధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుపు ఉన్న పన్ను విధానంతో పాటు ఎలాంటి మినహాయింపులూ లేని తక్కువ పన్ను శాతం కలిగిన రెండో విధానాన్ని  తీసుకొచ్చారు. అయితే, ఇది ఐచ్ఛికమని కేంద్రం పేర్కొంది.

దేశంలో అన్ని రంగాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల ఆర్థిక మందగమనం సాగుతోందని, అయితే, డిమాండ్‌ను పెంచేందుకు కేంద్రం ప్రత్యక్ష పన్నులు (వ్యక్తిగత, కార్పొరేట్‌) తగ్గించిందని ఎన్‌ఐపీఎఫ్‌పీ ప్రొఫెసర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డిమాండ్‌ ఒకింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మినహాయింపులు లేని పన్ను విధానం వల్ల ప్రజలు సేవింగ్స్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి యోగింద్ర అలాఘ్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. సేవింగ్స్‌ రేటు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక మందగమన పరిస్థితుల్లో అది తప్పు కాదని జేఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రోహిత్‌ ఆజాద్‌ అన్నారు. కొత్త పన్ను విధానం వల్ల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. దేశంలో గత ఆరేళ్లుగా సేవింగ్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. 2012లో దేశ సరాసరి సేవింగ్స్‌ రేటు 36 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 30 శాతానికి చేరింది. మరోవైపు 80 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారుతారని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే గతంతో అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని