మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ యాప్‌..!
close
Published : 18/02/2020 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ యాప్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులు వివిధ రకాల ఫైల్స్‌ను ఎడిట్‌, ఫార్మాట్‌ చేసుకోవడానికి.. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ యాప్స్‌ ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకునే పద్ధతికి పుల్‌స్టాప్‌ చెప్పింది. ఆ ఫీచర్లన్నింటినీ ఒకే యాప్‌లో అందిస్తూ.. ఆల్‌ ఇన్‌ వన్‌ అప్లికేషన్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. 

ఆండ్రాయిడ్‌ పోలీస్‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇప్పటికే గూగుల్‌ కూడా వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ తరహాలో డాక్స్‌, షీట్స్‌, స్లైడర్స్‌ పేరుతో గూగుల్‌ డ్రైవ్‌లో ఫీచర్లు అందిస్తోంది. కానీ గూగుల్‌లోనూ ఒక్కో యాప్‌ను ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ ఇలా ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పి.. అన్ని సాఫ్ట్‌వేర్లను ఒకే యాప్‌లో అందిస్తోంది. అంతేకాకుండా ఈ ఆల్‌ఇన్‌వన్‌ ఆఫీస్‌ యాప్‌ను కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే మైక్రోసాఫ్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్‌ యూజర్లకు ఈ అవకాశాన్ని కల్పించలేదు. ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్స్‌లో కూడా ఈ యాప్‌ ఉపయోగించడానికి వీలు కల్పించలేదు. ఈ యాప్‌ ఒకే బ్రౌజింగ్‌, స్కానింగ్‌ సహా వివిధ రకాల పనులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకుంటే గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లిన తర్వాత.. ‘microsoft office: word, excel, power point and more’ అని టైప్‌ చేసి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి..

microsoft office: word, excel, power point and moreమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని