సరికొత్త లుక్‌లో పవన్‌ కల్యాణ్‌
close
Published : 07/02/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త లుక్‌లో పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లుక్‌ ఆకట్టుకుంటోంది. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత  పూర్తిస్థాయి రాజకీయ రంగప్రవేశంతో పవన్‌ వెండితెరకు దూరమయ్యారు. ఇప్పటివరకూ ఆయన సినిమాల్లో నటించలేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం గుబురు గెడ్డం, మీసాలతో కనిపించారు పవన్‌. రెండేళ్ల విరామం అనంతరం మూడు సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నారు. దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా అంగీకరించారు. ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా గురువారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. విశేషమేమిటంటే సమావేశానికి ఆయన గడ్డం లేకుండా గుబురు మీసాలు, ఒత్తైన జుట్టుతో వచ్చారు. దీంతో రెండేళ్ల తర్వాత మునుపటి తమ అభిమాన నటుడిని చూశామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పింక్‌ రీమేక్‌ చిత్రానికి ‘లాయర్‌ సాబ్‌’, ‘వకీల్‌సాబ్‌’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత. మే 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని