
తాజా వార్తలు
అజ్ఞాతంలోకి అశోక్‌రెడ్డి!
శ్రావణి ఆత్మహత్య కేసులో ఆధారాల సేకరణ
ఈనాడు, హైదరాబాద్ : శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడి ఫోన్‌కాల్ డేటా ఆధారంతో వివరాలు రాబడుతున్నారు. బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. పసిగట్టిన దేవరాజ్, అశోక్‌రెడ్డి తప్పించుకునేందుకు పథకం వేశారు. దేవరాజ్ ఊరెళ్లినట్టు పోలీసులకు బురిడీ కొట్టించినట్టు విశ్వసనీయ సమాచారం. అశోక్‌రెడ్డి పేరు తెరమీదకు రాగానే సాయికృష్ణ ద్వారా దేవరాజ్ పేరు బయటకు తెచ్చారు.
ఆ 4 నెలల్లో ఏం జరిగింది: దేవరాజ్ వేధిస్తున్నట్టు జూన్ 22న శ్రావణి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మరుసటిరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దేవరాజ్‌ను అరెస్ట్ చేయవద్దని కోరింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. విషయం తెలిసిన సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఆమెపై మరింత ఒత్తిడి పెంచారు. సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసగించారంటూ పలుమార్లు శ్రావణి స్నేహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇటువంటి క్లిష్ట సమయంలో పరిచయమైన దేవరాజ్‌కు చేరువైంది. మొదట్లో ప్రేమిస్తున్నట్టు చెప్పినా ఆమెకు ఇద్దరితో శారీరక సంబంధం ఉందని తెలిశాక దూరంగా ఉంచాలనుకున్నాడు.
టిక్‌టాక్ బింధు ముందే హెచ్చరించినా?: దేవరాజ్ టిక్‌టాక్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి బారినపడి మోసపోయిన బిందు అనే యువతి.. దేవరాజ్ చేతిలో మోసపోవద్దంటూ సెల్ఫీ వీడియో ద్వారా శ్రావణిని హెచ్చరించింది.