ఈ కుర్రాడు ‘స్వాతిముత్యం’
close
Published : 15/09/2021 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ కుర్రాడు ‘స్వాతిముత్యం’

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఇంటి నుంచి మరో కథానాయకుడు తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన రెండో తనయుడు గణేష్‌ బెల్లంకొండ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్‌ .కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరుని ఖరారు చేశారు. మంగళవారం గణేష్‌ బెల్లంకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పేరుతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశాయి సినీ వర్గాలు. ‘‘జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ప్రత్యేకమైన ఆలోచనలు, అభిప్రాయాలున్న ఓ యువకుడి జీవిత ప్రయాణమే ఈ చిత్రం. స్వాతిముత్యంలాంటి యువకుడిగా కథానాయకుడు కనిపిస్తారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం మేళవింపుగా చిత్రం రూపొందుతోంద’’న్నారు దర్శకుడు. ‘‘ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతాం’’ అన్నారు నిర్మాత. నరేష్‌; రావు రమేష్‌, సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌, హర్షవర్ధన్‌, పమ్మిసాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: సూర్య, కూర్పు: నవీన్‌ నూలి, కళ: అవినాష్‌ కొల్ల, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని