Romantic: ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.. - telugu news Romantic Music Director Sunil Kashyap Special Chitchat
close
Updated : 26/10/2021 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి..

‘‘రొమాంటిక్‌’ భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు తప్పక కనెక్ట్‌  అవుతార’’న్నారు సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. ఇప్పుడాయన స్వరాలందించిన చిత్రం ‘రొమాంటిక్‌’. ఆకాష్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్‌ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్‌, ఛార్మినిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారుసునీల్‌  కశ్యప్‌.

‘‘నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. అందమైన ప్రేమ కథతో రూపొందింది. సినిమాలో చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. ముఖ్యంగా ద్వితియార్థం చాలా భావోద్వేగభరితంగా సాగుతుంది. పూరి సర్‌ మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్‌ అవ్వరు. అలాంటిది ఈ సినిమా చూశాక.. ఆయన కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అది చూశాక సినిమాపైనా.. నా పని పట్ల నమ్మకం వచ్చింది’’.

* ‘‘కథ విన్నప్పటి నుంచి.. ‘రొమాంటిక్‌’ అని టైటిల్‌ పెట్టినప్పటి నుంచి నేను కూడా రొమాంటిక్‌ అయిపోయి పాటలు కంపోజ్‌ చేశాను. మా ‘ఇస్మార్ట్‌’ గ్యాంగ్‌ అంతా అలా కూర్చొని సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్‌’. అది అందరికీ చాలా నచ్చేసింది. ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా ఓ పాట పాడింది’’.

* ‘‘సినిమాలతో పాటు క్లాసికల్‌ సంగీతం వైపు వెళ్లాలనుకుంటున్నా. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్‌  వేరియేషన్స్‌, క్లాసికల్‌ ఫ్యూజన్స్‌ రావొచ్చు. ప్రస్తుతం సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’కి స్వరాలందిస్తున్నా. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి’’.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని