close

తాజా వార్తలు

Updated : 20/10/2020 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ నెల 24న బాలకృష్ణ ‘నర్తనశాల’

పౌరాణిక... చారిత్రక పాత్రల్ని పోషించడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయనకి తన తండ్రి ఎన్టీఆర్‌ చిత్రాల్లో ‘నర్తనశాల’ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే స్వీయ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు. ద్రౌపతిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రతో శరత్‌బాబు కెమెరా ముందుకు వెళ్లారు. అర్జునుడిగా బాలకృష్ణ స్వయంగా నటించారు. అయితే ఆ చిత్రం పూర్తి కాకుండానే ఆగిపోయింది. అప్పట్లో తెరకెక్కించిన సన్నివేశాల్ని ఈ విజయదశమి సందర్భంగా శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్‌.బి.కె.థియేటర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో వసూలైన మొతం్తలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ‘‘ఎన్నాళ్ల నుంచో ‘నర్తనశాల’ సన్నివేశాల్ని చూడాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. వాళ్లందరి కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాల్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నాం’’ అని బాలకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.