ఆయన్ని ఎక్కడా తగ్గనివ్వను అంటున్న బన్నీ..!
close
Published : 30/01/2020 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన్ని ఎక్కడా తగ్గనివ్వను అంటున్న బన్నీ..!

వీడియో షేర్‌ చేసిన గీతా ఆర్ట్స్‌

హైదరాబాద్‌: సంక్రాంతి బరిలో బాక్సాఫీస్‌ విజేతగా నిలిచి చాలా గ్యాప్‌ తర్వాత ఓ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బంటుగా అల్లుఅర్జున్‌ నటన ప్రేక్షకులను మెప్పించింది. తెలిసిన కథే అయినప్పటికీ త్రివిక్రమ్‌ తెరకెక్కించిన విధానంతోపాటు ఆయన అందించిన మాటలు, బన్నీ నటన, తమన్‌ స్వరాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

‘అల..వైకుంఠపురములో..’ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న తరుణంలో చిత్రబృందం తాజాగా హిట్‌ ప్రోమోను విడుదల చేసింది. ‘రామచంద్ర అంటే గెలుపుకి కేరాఫ్‌ అడ్రస్‌.. ఎక్కడా తగ్గకూడదు. తగ్గనివ్వను’ అని బన్నీ చెప్పే డైలాగ్‌, ‘సిత్తరాల సిరపడు’ ఫైట్‌ ..మరిన్ని సన్నివేశాలతో ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ సినిమా ఇది. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించారు. టబు, మురళీశర్మ, సునీల్‌, సుశాంత్‌, నవదీప్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని