ఎన్టీఆర్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌
close
Published : 19/02/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: ‘కంటపడ్డావా.. కనికరిస్తా.. వెంట పడ్డానో నరికేస్తా ఓబా’ అంటూ రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ సందడి చేసిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ఖరారైంది. ఈ సినిమాను హారిక-హాసిని క్రియేషన్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై  ఎస్‌.రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం తారక్‌.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా ఓలివియా మోరిస్‌ నటించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తారు. ఇది వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకటన రాకముందే టైటిల్‌ కూడా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని