‘విరాట్‌పర్వం’లో నా పాత్ర అదే!
close
Updated : 26/04/2020 08:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విరాట్‌పర్వం’లో నా పాత్ర అదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగులో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘కింగ్‌’లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రానా కథానాయకుడిగా వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో ప్రియమణి బెల్లి లలిత అనే పాత్రలో నటిస్తోంది. సాయిపల్లవి కథానాయిక. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ. ‘‘ఇదొక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. సినిమా అంతా 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో ఉంటుంది. నా పాత్ర గురించి అందరికీ చెప్పాలని ఉంది. నేను నక్సలైట్‌గా కనిపిస్తా. చాలా తీవ్రమైన పాత్ర. మళ్లీ షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఇంకా ఇందులో నందితా దాస్, టబు, జరీనా వహబ్, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమాకి దగ్గుబాటి సురేష్, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీంతోపాటు ప్రియమణి వెంకటేష్‌తో కలిసి ‘నారప్ప’, ‘సిరివెన్నెల’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.

అందుకే ఐటమ్‌ సాంగ్‌ చేశా!

ఇక చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ‘వన్‌ టూ త్రీ..’ అంటూ ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన ప్రియమణి.. కేవలం షారుఖ్‌తో డ్యాన్స్‌ చేసేందుకు ఆ పాట ఒప్పుకొన్నట్లు పేర్కొంది. ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ఐటమ్‌ సాంగ్‌ చేయమని వాళ్లు అడిగారు. కేవలం షారుఖ్‌ పక్కన డ్యాన్స్‌ చేసే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఒప్పుకొన్నా. ఆ తర్వాత హిందీలో ఐటమ్‌ సాంగ్స్‌ చేయమంటూ ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు ఏదీ నచ్చలేదు. ఐటమ్‌సాంగ్‌ చేయడానికి బలమైన కారణం ఏదీ కనిపించలేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ప్రియమణి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ భార్య పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని