ప్రభాస్‌ సినిమా వేడుక.. ఫొటోలు చూశారా!
close
Published : 08/05/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ సినిమా వేడుక.. ఫొటోలు చూశారా!

షేర్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్‌: ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ తన 20వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తయింది. లాక్‌డౌన్‌కు ముందు చిత్ర బృందం జార్జియాలో చిత్రీకరణ పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చింది. కాగా గతంలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల్ని దర్శకుడు రాధాకృష్ణ శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ ఫొటోల్ని చూసి దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పూజా కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు కృష్ణంరాజు, దర్శకులు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, వి.వి. వినాయక్‌ తదితరులు హాజరై సందడి చేశారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జార్జియా నుంచి భారత్‌ చేరకున్న తర్వాత ప్రభాస్‌, పూజా హెగ్డేతోపాటు పలువురు యూనిట్‌ సభ్యులు స్వీయ నిర్భందంలో ఉన్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని