అప్పుడు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నా!
close
Updated : 09/04/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మా మధ్య ఉన్నవి రూమర్సే

రవి.. శ్రీముఖి వీళ్లు యాంకర్లు మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో టాప్‌ ర్యాంకర్లు. తమదైన యాంకరింగ్‌తో అభిమానుల మనసులకు బేడీలు వేస్తారు. ఫటాఫట్‌ పంచులతో.. ధనాధన్‌ డైలాగ్‌లతో యూత్‌ను ఫిదా చేసేస్తారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి గతంలో విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. అప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని తాజాగా మళ్లీ పునః ప్రసారం చేశారు. ఆ విశేషాలు మీకోసం..

‘జులాయి’ తర్వాత పెద్ద సినిమాల్లో ఎందుకు నటించలేదు?

శ్రీముఖి: ‘జులాయి’ చేస్తున్నప్పుడు ఇదే మొదటి, చివరి చిత్రమని నాన్న చెప్పారు. ‘టీవీల్లో ఎక్కువ షోలు చేస్తే, సినిమాల్లో అవకాశాలు రావు. మంచి కథలను ఎంచుకుని సినిమాలు చెయ్‌’ అని త్రివిక్రమ్‌గారు సూచించారు. ‘అదుర్స్‌’, ‘అదుర్స్‌2’ అయిపోయిన తర్వాత ఏ టీవీ షోలూ ఒప్పుకోలేదు. అయితే, అదే సమయంలో మంచి సినిమాలు కూడా రాలేదు. చిన్నచిన్న సినిమాలు వచ్చాయి. ‘ఎక్స్‌పోజింగ్‌ చేయాలి. ముద్దు సీన్లలో నటిస్తారా?’ అని అడిగారు. కుదరదని చెప్పా.

శ్రీముఖి చిన్నప్పుడు చాలా గుడ్‌ గర్ల్‌ అట కదా!

శ్రీముఖి: చిన్నప్పుడు బాగా చదివేదాన్ని. క్లాస్‌లో నాకంటే ఎక్కువ మార్కులు ఎవరికైనా వస్తున్నాయంటే తట్టుకునేదాన్ని కాదు. ఇక స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేదాన్ని.

చిన్నప్పుడు మీ నాన్నమొట్టికాయలుకొట్టేవారట!

రవి: నాకు లెక్కలు వచ్చేవి కావు. అందుకే దెబ్బలు తింటూ ఉండేవాడిని.

రవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

శ్రీముఖి: పని పిచ్చోడు. 

రవిని ఒక జంతువుతో పోల్చమంటే దేనితో పోలుస్తావు?

శ్రీముఖి: గొరిల్లా. ఎందుకంటే కోతి వేషాలు వేస్తుంటాడు. 

కాలేజీ రోజుల్లో గ్యాంగ్‌ మెయిటేన్‌ చేసేవారట!

రవి: నాపై చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్‌’ ప్రభావం చాలా ఉంది. అందులో చిరంజీవి చేసిన మేనరిజమ్స్‌ అన్నీ చేసేవాడిని.

ఓ బాలీవుడ్‌ హీరో అంటే మీకు చాలా ఇష్టమట ఎవరతను?

శ్రీముఖి: రణవీర్‌సింగ్‌. తెలుగులో చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు మాస్‌గా ఉంటే ఇష్టం. 

మరి మీకు ఏ హీరోయిన్‌ అంటే ఇష్టం!

రవి: ఇలియానా. ఇంటర్వ్యూ నిమిత్తం ఒకసారి మాత్రం కలిశా.

చిన్నప్పుడు ఎవరో కాల్చిపారేసిన సిగరెట్‌ కాల్చావట!

రవి: మా ఇంటిపైన చాలా ఖాళీ ఉండేది. సంక్రాంతికి మా బంధువులు, నాన్న స్నేహితులు వచ్చేవారు. పండగ బాగా చేసేవారు. మేడపై నుంచి అందరూ కిందకు వచ్చేసిన తర్వాత నేను పతంగుల కోసం పైకి ఎక్కా. అక్కడ కాల్చిపారేసిన సిగరెట్‌ ఉంది. అసలే మనపై సినిమాల ప్రభావం ఎక్కువ కదా! ఆ సిగరెట్‌ తీసి కాల్చా. కిందకు వెళ్లిపోయి ఇంట్లో వాళ్లకు దొరికిపోయా. బాగా కొట్టారు.

చలపతిరావును బుక్‌ చేశారట!

రవి: ఇంతకుముందు చాలా జరిగాయి. వాటిని నేను పట్టించుకోలేదు. ‘రవి ఒక మహిళను కించ పరిచేలా మాట్లాడాడు’ అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. ఒక వేళ నేను ఆడియన్స్‌లో ఉండి, ఎవరైనా అలా అని ఉంటే నేను నమ్మను. అందరూ నేనేదో తప్పుచేసినట్లు మాట్లాడుతుంటే, ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోదామనిపించింది. ఆఫీస్‌లో మా నాన్నను, చుట్టుపక్కల వాళ్లు మా అమ్మను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ టార్చర్‌ చేయడం మొదలుపెట్టారు. నేనేంటో మా వాళ్లకు తెలుసు. కానీ బయటవాళ్ల నమ్మరు కదా. ఆ సమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్‌.. సుమగారు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన తీరు ఇండస్ట్రీలో ఉండేలా చేసింది. 

శ్రీముఖి గోడకున్న మట్టి తింటావట నిజమేనా?

శ్రీముఖి: ఛీ..! ఇది ఎవరు చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు బలపాలు తినడం అలవాటు. సెలవులకు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లేదాన్ని. అక్కడ బలపాలు ఉండేవికావు. దాంతో గోడను గీకి తింటూ ఉండేదాన్ని. ఇప్పుడు మానేశా. 

మీ చిన్నప్పుడు లవ్‌స్టోరీ ఏంటి?

శ్రీముఖి: ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు నా వెంట పడ్డారు. మూడో తరగతిలో ఉండగా, ఆశిష్‌ అగర్వాల్‌ అనే అబ్బాయి బాగా చదివేవాడు. రోజూ స్కూల్‌కు బొట్టు పెట్టుకుని వచ్చేవాడు. దాంతో అతనంటే ఇష్టం ఉండేది. పదో తరగతి వరకూ చాలా లావుగా ఉండేదాన్ని. దాదాపు 100 కిలోలు ఉండేదాన్ని. వేసవి సెలవుల్లో మావయ్య పెళ్లి ఉండటంతో బరువు తగ్గడం ప్రారంభించా. అలా ఎనిమిది నెలల్లో 40 కేజీల వరకూ తగ్గా. ఇంటర్‌లో గర్ల్స్‌ కాలేజ్‌. అబ్బాయిలు ఉండేవారు కాదు. 

రవి.. శ్రీముఖి మధ్య రిలేషన్‌ ఉందని రూమర్స్‌ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది?

శ్రీముఖి: మీరే అన్నారు కదా రూమర్‌ అని..!

రవి: నిజంగా అది రూమరే. సాధారణంగా ఒక షో చేసేటప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం చేస్తుంటాం. అలాంటివన్నీ సినిమాల్లోనే చూసిన ప్రేక్షకులు మా మధ్య ఏదో ఉందని అనుకుంటారు.

ఫీమేల్‌ యాంకర్స్‌లో శ్రీముఖి అంటే ఇష్టమా..? లాస్య అంటే ఇష్టమా? లాస్యకు మీకు ఏదైనా గొడవ జరిగిందా?

రవి: శ్రీముఖి అంటే ఇష్టం. ఇక లాస్యతో నాకు గొడవేమీ కాలేదు. ఒక డ్యాన్స్‌ షోకు నన్ను, లాస్యను టీమ్‌ లీడ్‌ చేయమన్నారు. రెండు సీజన్లు చేశాం. మూడోసారి నేను ‘టీమ్‌ లీడ్‌ చేయను. యాంకరింగ్‌ చేస్తా’ అని అన్నా. ఈ విషయం తెలిసి, తను కూడా ‘రవి యాంకరింగ్‌ చేస్తే, నేను కూడా యాంకరింగ్‌ చేస్తా’ అని చెప్పింది. ఇద్దరినీ తీసేశారు. నాకు వేరే షోలు వచ్చాయి. తనకి మాత్రం రాలేదు. దీంతో ‘నీ వల్లే నాకు షోలు లేకుండా పోయాయి’ అని నెగెటివ్‌గా వెళ్లిపోయింది. నేనూ పట్టించుకోలేదు. ఇద్దరం కలిసి షోలు చేశాం. తన వల్ల నాకూ పేరొచ్చింది. ఇప్పుడు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. దీనికి నేను ఎంత వివరణ ఇచ్చినా వినటం లేదు. ఇక్కడితో ఆపేస్తే బెటర్‌ అని అనిపించింది.

మేల్‌ యాంకర్స్‌లో ప్రదీప్‌, రవి ఎవరంటే ఇష్టం?

శ్రీముఖి: ఎవరి స్టైల్‌ వారిది. ప్రదీప్‌తో కలిసి నేను యాంకరింగ్‌ స్టార్ట్‌ చేశా. ప్రదీప్‌ది క్లాస్‌ స్టైల్‌ ఉంటే, రవిది మాస్‌గా ఉంటుంది. 

ఎన్డీయే చేసి, బీటెక్‌ చదివి.. యాక్టింగ్‌ ఫీల్డ్‌కు ఎందుకు వచ్చారు?

రవి: దేశం కోసం ఏదైనా చేయాలని మా నాన్నకు ఉండేది. అందుకే నన్ను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీయే)లో చేర్పించారు. హోమ్‌ సిక్‌ కారణంగా వెళ్లిన నెలరోజుల్లోనే సన్నగా అయిపోయా. జ్వరం వస్తే ఊరుకునేవారు కాదు. ఆర్నెళ్లు భరించా. చివరకు గోడదూకి బస్సు ఎక్కి వచ్చేశా. ఇంటికి రాగానే నాన్న షాక్‌. ‘నా వల్ల కాదు. చచ్చిపోమంటే పోతా’ అని నాన్నకు చెప్పేశా. సర్లేనని ఎంసెట్‌ రాస్తే లక్షా 29 వేల ర్యాంకు వచ్చింది. దోస్తులందరూ బీటెక్‌ చేస్తుంటే, నేనూ బీటెక్‌ చేరా. ఎలాగో 52శాతం మార్కులతో పాసయ్యా. నాకు డ్యాన్స్‌ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడూ బర్త్‌డే పార్టీలకు డ్యాన్స్‌ నేర్పించి డబ్బులు సంపాదించేవాడిని. దాంతో ఇండస్ట్రీకి వెళ్లిపోతానని నాన్నకు చెప్పా. ఆయన ఒప్పుకోలేదు. ఉద్యోగం చేయమన్నారు. అప్పుడు ఒక సంగీత్‌ ఫంక్షన్‌ కోసమని నిమ్మగడ్డ ప్రసాద్‌గారి వైఫ్‌కి డ్యాన్స్‌ నేర్పించా. ఆమె ద్వారా అమలగారు, ఆ తర్వాత నాగార్జున గారు పరిచయం అయ్యారు. ‘నువ్వు ఏమవుదామనుకుంటున్నావు’ అని నాగార్జునగారు అడిగితే ‘హీరో’ అనిచెప్పా. ఆయన తిట్టి, ‘ఫలానా ఛానెల్‌ హెడ్‌ను కలువు. యాంకరింగ్‌ చేసుకో’ అని సలహా ఇచ్చారు. అలా యాంకరింగ్‌ వైపునకు వచ్చేశా. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానం

రవి

శ్రీముఖి

యాంకరింగ్‌: ప్యాషన్‌

సినిమా: డ్రీమ్‌

మందు: అప్పుడప్పుడు

డబ్బు: అవసరం

పప్పు: వద్దు

పబ్బు: చిరాకు

నాగార్జున: దారి చూపిన దేవుడు

నాన్న: సర్దార్‌ పాపారాయుడు

ఫ్రెండ్స్‌: లైఫ్‌

శ్రీముఖి: డార్లింగ్‌

లాస్య: ఎందుకిప్పుడు

ఆడాళ్లా మజాక: సూపర్‌హిట్‌ 

సినిమా: ఇష్టం

యాంకరింగ్‌: ఇది ప్రొఫెషన్‌ అనుకొని రాలేదు.

పెళ్లి: చాలా టైముంది

గోల్డ్‌: నాకు అస్సలు ఇష్టం లేదు.

షూటింగ్‌లకు ఆలస్యం: అనివార్య కారణాలు

రవి: ఒకాకొన సమయంలో స్ఫూర్తినింపిన వ్యక్తి 

ఆలీ: ఐ లవ్‌ వ్యూమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని