చిరంజీవి సినిమా నుంచి వైదొలిగిన త్రిష
close
Updated : 13/03/2020 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి సినిమా నుంచి వైదొలిగిన త్రిష

ట్విటర్‌లో వెల్లడి

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుంచి కథానాయిక త్రిష తప్పుకొన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఎంచుకున్నారు. అయితే ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు ఆమె శుక్రవారం సాయంత్రం స్పష్టం చేశారు. ‘కొన్ని విషయాలు తొలుత చెప్పినట్లు, చర్చించుకున్నట్లు కాకుండా విభిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్‌ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు. తెలుగు ఆడియన్స్‌.. మరొక మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

చిరు-త్రిష కలిసి ‘స్టాలిన్‌’ సినిమాలో నటించారు. 2006లో వచ్చిన ఈ సినిమా హిట్‌ అందుకుంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చిరు-త్రిష కాంబినేషన్‌ రాబోతోంది అనడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోసారి వీరి జోడీని వెండితెరపై చూడబోతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. త్రిష చేతిలో ప్రస్తుతం ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘గర్జనై’, ‘రామ్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ప్రాజెక్టులు ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని