Arvind kejriwal: కేజ్రీవాల్‌కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం

మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సీఎం కేజ్రీవాల్‌కు ఇంట్లో తల్లిదండ్రులు స్వాగతం పలికారు.

Published : 10 May 2024 22:55 IST

దిల్లీ: తిహాడ్‌ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇంటికి చేరుకున్నారు. అక్కడ తన తల్లిదండ్రులను చూడగానే  ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. వారి పాదాలకు నమస్కరించారు. ఆయనకు పూలమాల వేసిన తల్లి హారతి ఇచ్చి బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు.

దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై  మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. దాదాపు 50 రోజుల పాటు ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. జూన్‌ 2న తిరిగి కేజ్రీవాల్‌ సరెండరై జైలుకు రావాలంటూ కోర్టు పలు షరతులు విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు