చిరు-మోహన్‌బాబు సరదా కవ్వింపులు
close
Published : 28/03/2020 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు-మోహన్‌బాబు సరదా కవ్వింపులు

నో హగ్స్‌.. ఓన్లీ నమస్తే అంటోన్న చిరు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవి, మోహన్‌బాబు ఒకచోట కలిస్తే సరదా కవ్వింపులు, చమక్కులు ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరి సరదాకు ట్విటర్‌ వేదికగా మారింది. కరోనా వైరస్‌ కారణంగా సామాజిక దూరానికి పెద్ద పీట వేస్తోన్న సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిమానులకు తగిన సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా చిరంజీవి ట్విటర్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీతారలతోపాటు మోహన్‌బాబు కూడా చిరుకి ట్విటర్‌లోకి స్వాగతం పలికారు. తనకి వెల్‌కమ్‌ చెప్పిన వారందరితోపాటు మోహన్‌బాబుకి రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?’ అంటూ చిరు సినిమా డైలాగ్‌తో సరదాగా రిప్లై ఇచ్చారు.

చిరు ఇచ్చిన రిప్లైపై తాజాగా మోహన్‌బాబు స్పందించారు. ‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతాను!’ అని కవ్వింపుగా అన్నారు. అయితే మోహన్‌బాబు పెట్టిన తాజా ట్వీట్‌పై చిరు ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో మరో సరదా కామెంట్‌ చేశారు. ‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. నో హగ్స్‌.. నో షేక్‌ హ్యాండ్స్‌.. ఓన్లీ నమస్తే!! సామాజిక దూరం అనేది చాలా ముఖ్యం. మనకు ఎంతో ప్రియమైన వారిని, సన్నిహితులను జాగ్రత్తగా కాపాడుకునేందుకు అవగాహన కోసం లక్ష్మిమంచు చేసిన వీడియో చూడు’ అని చిరు చమక్కులు విసిరారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని