జనసేన, భాజపా కీలక నిర్ణయం!
close
Updated : 13/01/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనసేన, భాజపా కీలక నిర్ణయం!

దిల్లీ: ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, భాజపా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌.. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. అమరావతిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి అంశాలను నడ్డాకు పవన్‌ వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని.. ఏపీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నానని పవన్‌తో చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిపై త్వరలోనే ఇరు పార్టీలు పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేసే అవకాశముంది. 

ఇదీ చదవండి..

జేపీ నడ్డాను కలిసిన పవన్‌ కల్యాణ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని