ఆ ఇసుకంతా ఎటు వెళ్లిపోయింది?: పవన్‌
close
Published : 01/06/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇసుకంతా ఎటు వెళ్లిపోయింది?: పవన్‌

విజయవాడ: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని జనసేన అధినేత పనన్‌ కల్యాణ్‌ తెలిపారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుక సరఫరా సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ చేస్తోందన్నారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందన్నారు. పెరిగిన ఇసుక ధరలతో మధ్యతరగతి వారు గృహ నిర్మాణం అంటేనే భయపడి వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇసుక లారీలు వేలాదిగా తిరిగాయని.. ఇసుక మాత్రం డంపింగ్ ప్రదేశాలకు చేరలేదన్నారు. మరి ఆ ఇసుకంతా ఎటు వెళ్లిపోయింది?అని పవన్‌ ప్రశ్నించారు. ఇసుక కొరత, కరోనా వ్యాప్తి తదితర కారణాలతో పనులు దొరక్క కార్మికులు అల్లాడిపోతున్నారన్నారు.  భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని పనన్‌ కల్యాణ్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని