60 గజాల ఇంటికి అనుమతి అక్కర్లేదు
close
Updated : 22/05/2020 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 గజాల ఇంటికి అనుమతి అక్కర్లేదు

టీఎస్‌ బీపాస్‌తో గృహ నిర్మాణ నిబంధనలు సరళతరం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణానికి సరికొత్త విధానాన్ని జూన్‌ మొదటి వారంలో అమలులోకి తేనున్నారు. తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ సిస్టం ఆన్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌(తెలంగాణ బీపాస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనుంది. 60 గజాల స్థలంలో జీహెచ్‌ఎంసీ నుంచి ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండానే ఇల్లు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ఇల్లు నిర్మించాలనుకుంటే ముందుగా బల్దియా ప్రణాళికా విభాగానికి దరఖాస్తు చేయాలి. తుది అనుమతికి ఆలస్యం అవుతుండడంతో ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ భావించి టీఎస్‌ బీపాస్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రమంతా వచ్చే నెల మొదటి వారంలో అమల్లోకి తేవాలని ఆదేశించారు. బల్దియాలో గత ఏడాది 23 వేల మంది నిర్మాణాల కోసం దరఖాస్తు చేస్తే 21 వేల మంది స్వీయ ధ్రువీకరణ పత్రం ఇచ్చి నిర్మాణాలను మొదలుపెట్టే విభాగంలోకి వచ్చారని అధికారులు తెలిపారు.
* 75 గజాల స్థలంలో రెండు అంతస్తులను నిర్మించుకోవాలనుకొనే వారు జీహెచ్‌ఎంసీకి నగర ప్రణాళికా విభాగం వెబ్‌సైట్‌లో ఇంటి రిజిస్ట్రేషన్‌ చేసుకొని నిర్మాణం మొదలు పెట్టుకోవచ్చు. 75 గజాల నుంచి 600 గజాల లోపులో మూడు అంతస్తుల వరకు గృహ నిర్మాణాలకు వెబ్‌సైట్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రంతోపాటు ప్లాన్‌ అప్‌లోడ్‌ చేయాలి. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుదారుడికి వెళతాయి. 600 గజాలపైన నిర్మాణాలు చేపట్టేవారు అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సిందే. ఆన్‌లైన్‌లోని దరఖాస్తు ఆరు శాఖలకు వెళుతుంది. 10 రోజుల్లో ఆ విభాగాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలి. 21 రోజుల్లోగా స్పష్టత ఇవ్వకపోతే అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణిస్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని